Home సినిమా మిస్సెస్ దేశ్ పాండే వెబ్ సిరీస్ రివ్యూ – Swen Daily

మిస్సెస్ దేశ్ పాండే వెబ్ సిరీస్ రివ్యూ – Swen Daily

by
0 comment
మిస్సెస్ దేశ్ పాండే వెబ్ సిరీస్ రివ్యూ
2,807 Views



వెబ్ సిరీస్: మిస్సెస్ దేశ్ పాండే
తారాగణం: మాధురి దీక్షిత్, సిద్ధార్థ్ చందేకర్, ప్రియాంషు ఛటర్జీ, దీక్షా జునేజా భర్తీ
ఎడిటింగ్: టపాస్ శంకర్
సినిమాటోగ్రఫీ: సంగ్రమ్ గిరి
మ్యూజిక్: టపాస్ రెలియా
నిర్మాతలు: రూపా దేశాయ్, ఇలాహె హిప్టూలా
దర్శకత్వం: నాగేశ్ కుకునూర్
ఓటీటీ: జియో హాట్ స్టార్

కథ:
ముంబైలోని ఒక ఇంట్లో నైలాన్ రోప్ తో దారుణంగా ఒక మనిషిని గొంతు నులిమి చంపేస్తాడు కిల్లర్. అలా సిటీలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఆ ముంబై సిటీ కమీషనర్ అరుణ్ ఖత్రి (ప్రియాన్షు ఛటర్జీ).. ఈ కిల్లర్ ను పట్టుకునే భాద్యతను అండర్ కవర్ ఆఫీసర్ అయినటువంటి తేజస్(సిద్ధార్థ్ చందేకర్)కి అప్పగిస్తాడు. తేజస్, తన్వీ(దీక్షా జునేజా) కలిసి హ్యాపీగా ఉంటారు. అయితే ఈ వరుస హత్యలు అంతకముందు మిస్సెస్ దేశ్ పాండే(మాధురి దీక్షిత్) చేసేది. తను వేరే సిటీలోని సెంట్రల్ జైలులో ఉంటుంది. అందుకే తనని వేరొక ఇంటికి తీసుకొని వచ్చి తన సహాయం తీసుకున్నాడు కమీషనర్ అరుణ్ ఖత్రి. ఇక అప్పటి నుండి మిస్సెస్ దేశ్ పాండే, తేజస్ టీమ్ కలిసి సీరియల్ కిల్లర్ ని పట్టుకోడానికి ప్రయత్నించారు. మరి ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? అతడిని తేజస్ అండ్ మిస్సెస్ దేశ్ పాండే టీమ్ పట్టుకున్నారా లేదా? అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. (శ్రీమతి దేశ్‌పాండే వెబ్ సిరీస్ రివ్యూ)

విశ్లేషణ:
ఈ సిరీస్ మొత్తం ఆరు ఎపిసోడ్ లు ఉంటుంది. మొదటి ఎపిసోడ్ (టేక్స్ వన్ టూ క్యాచ్ వన్): ఇందులో సెంట్రల్ జైలులో ఉన్న మిస్సెస్ దేశ్ పాండేని మరొక ఇంటికి మార్చి హంతకుడుని పట్టుకోవాలని ముంబై కమీషనర్ చెప్తాడు. రెండో ఎపిసోడ్(ది సీక్రెట్ లెటర్స్): ఈ ఎపిసోడ్‌లో ఒక క్రిమినల్ మీద అనుమానంతో అతడి ఇంటికి వెళ్ళగా అక్కడ వాష్ రూమ్‌లో ఓ కవర్‌లో లెటర్స్ ఉంటాయి. అవి తీసి చూసిన తేజస్ కి మిస్సెస్ దేశ్ పాండే మీద అనుమానం కలుగుతుంది. ఇక మూడో ఎపిసోడ్ (ట్రూత్ ఇన్ వర్డ్స్): తేజస్ కి నిజం చెప్పడానికి మిస్సెస్ దేశ్ పాండే ప్రయత్నిస్తుంది కానీ తనని ఇంకా ఖైదీలానే చూస్తాడు.

నాల్గో ఎపిసోడ్ ( ఏ కిల్లర్ ఈజ్ బార్న్): ఇందులో అలెక్స్, తేజస్ కలుస్తారు. అయిదో ఎపిసోడ్ (శిష్య): మిస్సెస్ దేశ్ పాండే తన తెలివితేటలతో అతనెవరో కనిపెట్టే ఎపిసోడ్ ఇది. ఆరో ఎపిసోడ్(ది ఫైనల్ జడ్జ్ మెంట్): ఇందులో అసలు క్రిమినల్ ఎవరు.. దానికి గల కారణాలు.. మిస్సెస్ దేశ్ పాండే గతం.. ఇలా అన్నీ రివీల్ అయ్యే ఎపిసోడ్.

ఇక ఈ సిరీస్ లో ప్రతీ ఎపిసోడ్ యాభై నిమిషాల పైనే ఉంటుంది. మనం సిరీస్ చూసేటప్పుడు 1.24x లేదా 1.5x స్పీడ్ తో చూస్తే బాగుంటుంది. ఎందుకంటే అంత ల్యాగ్ ఉంటుంది. ప్రతీ విషయం క్షుణ్ణంగా వివరించే ప్రయత్నంలో భాగంగా చాలా స్లోగా సాగుతుంది. కథ బాగున్నప్పటికి ఇంత స్లో స్క్రీన్ ప్లే చేయడం చాలా చిరాకు తెప్పిస్తుంది.

సీరియల్ కిల్లర్ ని పట్టుకునే ప్రయత్నంలో భాగంగా వచ్చే ట్విస్ట్ లు బాగా ఉంటాయి. అయితే ఈ సిరీస్ లో అసలు కిల్లర్ ఎవరు.. ఎందుకు ఇదంతా చేశారో తెలుసుకోవాలంటే నాలుగు గంటల ఎపిసోడ్ లు చూడాలి. ఇంత సేపు ఓ కిల్లర్ ఎవరో తెలుసుకోవాలంటే ఓపిక ఎవరికి ఉంటుంది. అది రెగ్యులర్ గా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ని చూస్తే ఆడియన్స్ కి మాత్రమే ఉంటుంది.

అయితే ఈ సిరీస్ ప్లాట్ బాగుంటుంది. కానీ దీనిని నాలుగు ఎపిసోడ్ లకు కుదించి.. ప్రతీ ఎపిసోడ్ ని ఇరవై నుండి ముప్పై ఎపిసోడ్ లకి కుదించొచ్చు. కానీ దర్శకుడు క్రైమ్ ని, క్రిమినల్ ని, అతని గతాన్ని డీటేయిలింగ్ చెప్పడం కోసం కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు.

ఈ తరహా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ చాలానే వచ్చాయి. కానీ అవి కాస్త బెటర్ ఎందుకంటే ఇందులో ఇంటెన్స్ లేదు ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లేదు. కిల్లర్ ఎవరో తెలిసిన అతడి తాలుకా గతాన్ని సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోయాడు దర్శకుడు.

స్లోగా సాగే ఎపిసోడ్స్ ఆడియన్ ని చివరి వరకు కూర్చోబెట్టలేవు. కానీ ఎంచుకున్న కథ బాగుంది. క్యారెక్టర్లు కొత్తగా డిజైన్ చేశారు. ఎక్కడ అసభ్య పదజాలం వాడలేదు. అశ్లీల దృశ్యాలు లేవు.

నటీనటుల పనితీరు:
మిస్సెస్ దేశ్ పాండేగా మాధురి దీక్షిత్, తేజస్ గా సిద్ధార్థ్ చందేకర్ సిరీస్ కి ప్రధాన బలంగా నిలిచారు.

ఫైనల్ గా..
స్లోగా సాగినా.. వన్ టైం వాచెబుల్.

రేటింగ్: 2/5

✍️. దాసరి మల్లేశ్

You may also like

Leave a Comment

MS Live 99 News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana,  is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird