Home సినిమా షోలే రీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. కొత్త క్లైమాక్స్ డిటైల్స్ ఇవే – Swen Daily

షోలే రీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. కొత్త క్లైమాక్స్ డిటైల్స్ ఇవే – Swen Daily

by
0 comment
షోలే రీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. కొత్త క్లైమాక్స్ డిటైల్స్ ఇవే
2,805 Views




-కొత్త క్లైమాక్స్ లో ఏముంది
-ఎంతో మందికి స్టార్ స్టేటస్
-1500 థియేటర్లలో హంగామా

భారతీయ సినిమా స్థితిని గతి మార్చివేసిన చిత్రం ‘షోలే'(షోలే).ఎంతో మందికి నైట్ ఓవర్ స్టార్ స్టేటస్ ని కట్టబెట్టి భారతీయ సినీ యవనిక పై తిరుగులేని హీరోలుగా చెలామణి అయ్యే అవకాశం కల్పించింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్(అమితాబ్ బచ్చన్)హిమాన్ గా ఫ్యాన్స్ పిలుచుకునే ధర్మేంద్ర,(ధర్మేంద్ర)హేమమాలిని(హేమ మాలిని) జయబచ్చన్(జయా బచ్చన్),అంజాద్ ఖాన్, సంజీవ్ కుమార్ లే ఉదాహరణ. నేటికీ చాలా సినిమాల కథ, కథనాలు, క్యారెక్టర్ల తీరు తెన్నులు ‘షోలే’ ని ఇన్ స్ప్రెషన్‌గా తీసుకొని తెరకెక్కుతాయంటే ‘షోలే’ సృష్టించిన సునామి రేంజ్ ని అర్ధం చేసుకోవచ్చు.

ఇప్పుడు ఈ మూవీ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రీ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది. దీంతో అభిమానులు రీ రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తూ వస్తున్నారు. ఈ నెల 12న 1500 థియేటర్లలో విడుదల కాబోతుందని అధికార ప్రకటన వచ్చింది. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే1975లో ‘షోలే’ రిలీజ్ అయినప్పుడు మేకర్స్ మొదట అనుకున్న క్లైమాక్స్ ని మార్చాల్సి వచ్చింది. అప్పట్లో వచ్చిన ‘ఎమర్జెన్సీ’ కారణంగా, సెన్సార్ బోర్డు అభ్యంతరాలతో ఆ పని చేసారు. అయితే ఇప్పుడు రీ రిలీజ్ లో మొదట అనుకున్న క్లైమాక్స్ సన్నివేశం ఉండబోతుంది. అంటే కొత్త సినిమా చూసిన అనుభూతితో అభిమానులు, ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకి రానున్నారు.

కూడా చదవండి: షోలే రీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. కొత్త క్లైమాక్స్ డిటైల్స్ ఇవే

ఆగస్టు 15, 1975న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘షోలే’ పక్కా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఇటీవల మరణించిన ధర్మేంద్ర కి రీ రిలీజ్ ద్వారా నివాళి అర్పించనున్నారు. రమేష్ సిప్పి(రమేష్ సిప్పి)దర్శకత్వంలో జిపి సిప్పి నిర్మించగా సలీం జావేద్ రచయితలుగా వ్యవహరించారు. మూడు కోట్ల రూపాయలతో నిర్మాణం జరుపుకొని 35 రూపాయలు వసూలు చేసింది.

You may also like

Leave a Comment

MS Live 99 News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana,  is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird