Home సినిమా అసలు ssmb 29 ప్రొడ్యూసర్ ఎవరు! – MS Live 99 News

అసలు ssmb 29 ప్రొడ్యూసర్ ఎవరు! – MS Live 99 News

by MS LIVE 99 NEWS
0 comment
అసలు ssmb 29 ప్రొడ్యూసర్ ఎవరు!
2,809 Views



-ssmb 29 హంగామా స్టార్ట్
-ఈవెంట్ పై అందరిలో భారీ అంచనాలు
-టైటిల్ చెప్పబోతున్నారా!
-ప్రొడ్యూసర్ కె ఎల్ నారాయణ ఎవరు!

సూపర్ స్టార్ మహేష్ బాబు(మహేష్ బాబు),దర్శకధీరుడు రాజమౌళి(రాజమౌళి)అభిమానుల కోలాహలం గంటల్లో ప్రారంభం. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీ లో జరిగే ssmb 29 వేడుకలకు వేదిక. ఈ వేడుకలోనే టైటిల్ ని అనౌన్స్ చేయడంతో పాటు సినిమాకి సంబంధించిన వివరాలను వెల్లడి చేస్తారేమో అనే ఆసక్తి అందరిలో కూడా ఉంది. ఈదుర్గ ఆర్ట్స్ పతాకంపై ‘కెఎల్ నారాయణ'(Kl నారాయణ)భారతీయ చిత్రపరిశ్రమలోనే ఇంతవరకు విడుదలైన హై బడ్జెట్ తో నిర్మాణం. దీంతో ఇప్పుడు ssmb 29 ఫీవర్ కూడా స్టార్ట్ కావడంతో ఎల్ నారాయణ ఎవరనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.

కే ఎల్ నారాయణ సినీ రంగంలో సుదీర్ఘ కాలం నుంచి ఉంటున్నారు. ఉత్తమ అభిరుచిగల నిర్మాత అనే పేరు కూడా ఉంది. ఒక రకంగా దుర్గ ఆర్ట్స్ అంటే హిట్ సినిమాకి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకోవచ్చు.1990లో వెంకటేష్, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన క్షణక్షణం తొలి చిత్రం. ఆ తర్వాత హలోబ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట,సంతోషం, నిన్నే ఇష్టపడ్డాను వంటి విభిన్న జోనర్స్ కి సంబంధించిన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. పైగా ఆ చిత్రాలన్నీ సదరు హీరోలని కెరీర్ పరంగా ఇంకో మెట్టు పైకి ఎక్కించాయి. 2003 తర్వాత ఇప్పుడు ssmb 29 తో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు. పైగా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న రాజమౌళి కోసం ఎంతో మంది సినిమా నిర్మించడానికి వెయిట్ చేస్తుండగా, కె ఎల్ నారాయణ ఆ అవకాశం దక్కించుకున్నారు.

ఇది కూడా చదవండి: లెజండ్రీ హీరోయిన్ మృతి.. భారతీయ చిత్ర పరిశ్రమకి ఎన్నో సేవలు

ఈ విషయంపైనే ఒక ఇంటర్వ్యూలో కే ఎల్ నారాయణ మాట్లాడుతు మహేష్, రాజమౌళి కాంబోని పదిహేను సంవత్సరాల క్రితమే ఫిక్స్ చేసాం. ఇప్పుడు మహేష్, రాజమౌళి క్రేజ్ మరో స్థాయిలో ఉంది. అయినా నాకిచ్చిన మాటకి కట్టుబడి సినిమా చేస్తున్నారు. అసలు నేను చెప్పకుండానే నాకు సినిమా చేస్తున్నామని ఆ ఇద్దరే అధికారకంగా ప్రకటించారని చెప్పుకొచ్చారు. ఇక ssmb 29 తో కె ఎల్ నారాయణ కూడా స్టార్ గా అవతరించారని చెప్పుకోవచ్చు.


You may also like

Leave a Comment

MS Live 99 News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana,  is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird