
-సత్య ప్రకాష్ అసలు ఎవరు!
-విలన్ గా ఎన్ని సినిమాలు
-సత్య ప్రకాష్ లా నటించే వాళ్ళు ఎంతోమంది
– ఎస్ రవికుమార్ చౌదరి ఏం చెప్పాడు
సిల్వర్ స్క్రీన్ పై ఇప్పుడంటే విలనిజం యొక్క మేనరిజం, నట ఉదృతి కొంచం తగ్గింది. కానీ ఒకప్పుడు హీరోలకి ఎంత మంది అభిమానులు, వీరాభిమానులు ఉండే వారో, విలన్ కి అదే విధంగా ఉండేవారు. అభిమాన హీరో హావభావాలతో యాక్ట్ చేసే వాళ్ళు కూడా ఎంత మంది ఉండేవారో, విలన్ హావభావాల ప్రదర్శన విషయంలో అభిమానులు తగ్గేదెలే అనే విధంగా ఉంటారు. అటువంటి కొంత మంది విలన్స్ లో ‘సత్య ప్రకాష్’ కూడా ఒకరు.మూడు దశాబ్దాల క్రితమే వచ్చిన ‘పోలీస్ స్టోరీ’ మూవీలో సత్య అనే క్యారక్టర్ లో సత్య ప్రకాష్(సత్య ప్రకాష్)ప్రదర్శించిన విలనిజం ప్రాక్టీస్ చేసిన వారు కోకొల్లలు.
పోలీస్ స్టోరీ అంటే కాదు చాలా సినిమాల్లో తనదైన విలనిజంతో మెస్మరైజ్ చేయడం సత్య రాజ్ స్పెషాలిటీ. రీసెంట్ గా ‘ఓజి’ లోను తన సత్తా చాటాడు. నెగిటివ్ రోల్స్ లో సత్య ప్రకాష్ మేనరిజం చాలా సపరేట్ గా ఉంటుంది. ఆవేశంతో ఒకే డైలాగ్ ని పదే పదే చెప్పాలని చెప్పడంలో సిద్ధహస్తుడు. అసలు సత్య ప్రకాష్ లేకుండా ప్రదర్శించే విలనిజం చూసి చిన్న, పెద్ద అనే తేడా భయపడేవాళ్ళు. దీనితో బయట కూడా అదే విధంగా ఉంటాడనే అభిప్రాయం చాలా మందిలో ఉండేది. కానీ సత్య ప్రకాష్ ఒక సద్బ్రాహ్మణుడు. నిత్యం వేద మంత్రాలు పఠిస్తూ ఆయన మంత్రాల యొక్క విశిష్టత గురించి పది మందికి చెప్తాడు. అసలు తాను ఒక వ్యక్తితో మాట్లాడుతుంటే ముందుగా దైవం గురించిన చర్చ ఉంటుంది. అంత దైవ భక్తుడు. మరి విలనిజాన్ని ప్రదర్శించడానికి ముఖ్య కారణం నటన మీద ఆసక్తి. నటనని కూడా దైవంగా భావించాడు. సత్య ప్రకాష్ గురించి ఈ వివరాల ప్రకారం ప్రముఖ దర్శకులు ‘ఏఎస్ రవికుమార్ చౌదరి'(as Ravikumar chowdary)ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది.
ఇది కూడా చదవండి: కాంతార చాప్టర్ 1 ,కొత్తలోక చాప్టర్ 1 ఎవరు గెలిచారు.. ఒక్క పాయింట్ తేడా అంతే
ఒడిస్సా కి చెందిన సత్య ప్రకాష్ తెలుగు చిత్ర పరిశమ్రలో బడా విలన్స్ రాజ్యమేలుతున్న రోజుల్లోనే సినీ రంగ ప్రవేశం చేసి తన సత్తా చాటాడు. తన మొదటి చిత్రం నాగార్జున హీరోగా 1991 లో జైత్ర యాత్ర. తెలుగులో దాదాపుగా అందరి అగ్ర హీరోల సినిమాల్లో చేసాడు. ప్రతి సినిమాలో తన బ్రాండ్ ఆఫ్ విలనిజం మాత్రం పక్కా. మొత్తం పదకొండు భాషల్లో సుమారు 500 చిత్రాల వరకు చేసాడు. గాను ఎంట్రీ ఇచ్చి తన డైరెక్టర్ కొడుకు తో ‘ఊల్లాల్లా, ఊల్లాల్లా అనే డ్రింకింగ్ చేశాడు.


CEO
Mslive 99news
Cell : 9963185599
