Home సినిమా 23 కి ప్రభాస్ కి సంబంధం ఏంటి! విషయం తెలియడంతో ఫ్యాన్స్ అభినందనలు – MS Live 99 News

23 కి ప్రభాస్ కి సంబంధం ఏంటి! విషయం తెలియడంతో ఫ్యాన్స్ అభినందనలు – MS Live 99 News

by MS LIVE 99 NEWS
0 comment
23 కి ప్రభాస్ కి సంబంధం ఏంటి!  విషయం తెలియడంతో ఫ్యాన్స్ అభినందనలు
2,807 Views



-ప్రభాస్ అభిమానుల శుభాకాంక్షలు
-పాన్ ఇండియా స్టార్ గా అవతరణ
-తెలుగు సినిమాకి కూడా పాన్ ఇండియా గుర్తింపు
-అప్ కమింగ్ చిత్రాలపై భారీ అంచనాలు

రెబల్ స్టార్ గా అడుగుపెట్టిన ప్రభాస్(ప్రభాస్)ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఒక రకంగా పాన్ ఇండియా స్టార్ గా ‘ప్రభాస్’ ఎదుగుదల, తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎదగడానికి కూడా దోహద పడిందని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.అభిమాన ఘనం కూడా సినిమాకి పెరుగుతూ వస్తుంది. అందుకు కారణమైన చిత్రాల జాబితా కూడా అభిమానులు, ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా ఉన్నారు.

ప్రభాస్ సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించి నేటితో ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది. ప్రభాస్ మొదటి చిత్రం ఈశ్వర్ నవంబర్ 11 2002 న థియేటర్స్ లోకి అడుగుపెట్టింది. అంటే నేటికీ 23 సంవత్సరాలు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రభాస్ పోస్టర్ హల్ చల్ చేస్తుంది. ఆ పోస్టర్ లో 23 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ కి శుభాకాంక్షలు. ప్రతి సినిమా మూమెంట్ ఒక మెమొరీ. నీ కంటు ఒక ఎరా సృష్టించుకున్నావంటూ అనే పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

కూడా చదవండి: చికిరి సాంగ్ పై రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలు

అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలు ‘ది రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్ వంటి చిత్రాలతో ఉన్నాయి. వీటిలో దిరాజాసాబ్(ది రాజా సాబ్)సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 9 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఫౌజీ(ఫౌజీ)చిత్రీకరణ దశలో ఉండగా స్పిరిట్(స్పిరిట్)త్వరలోనే షూటింగ్ కి వెళ్లనుంది.


You may also like

Leave a Comment

MS Live 99 News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana,  is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird