Home సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ లో ఎవరు విన్నర్ – Swen Daily

ఫస్ట్ డే కలెక్షన్స్ లో ఎవరు విన్నర్ – Swen Daily

by
0 comment
ఫస్ట్ డే కలెక్షన్స్ లో ఎవరు విన్నర్
2,812 Views



– బాహుబలి ఎపిక్ vs మాస్ జాతర
– ప్రభాస్, రాజమౌళి, రానా షో స్టార్ట్
– మాస్ జాతర పై భారీ అంచనాలు
– రవి తేజ ఫాన్స్ హంగామ

శుక్రవారం అంటేనే సినిమా.. సినిమా అంటే శుక్రవారం. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ రోజు రిలీజ్ అయ్యే చిత్రాల మధ్య జరిగే పోటీ ఎంతో రసవత్తరంగా ఉంటుంది. ఒక వేళ అగ్ర హీరోలకి సంబంధించిన రెండు ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్స్ విడుదలైతే, తొలి రోజు కలెక్షన్స్ విషయంలో అభిమానుల మధ్య పోటీ కూడా నెలకొని ఉంటుంది. మూవీ లవర్స్ సైతం ఈ విషయంలో ఎంతో ఆసక్తిని కనపరచడం ఆనవాయితీ.

తెలుగు సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన బాహుబలి పార్ట్ 1 ,పార్ట్ 2 చిత్రాలు బాహుబలి ఎపిక్(బాహుబలి ఎపిక్)గా ఈ నెల 31న వరల్డ్ వైడ్ గా విడుదలయ్యాయి. దీంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఎపిక్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రాజమౌళి(Ss Rajamoul),ప్రభాస్(ప్రభాస్),రానా(రానా)లు ప్రమోషన్స్ లో ఎపిక్ గురించి పలు ఆసక్తి కర విషయాలని చెప్తున్నారు. దీనితో ఎపిక్ ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అనే ఉత్సాహం అందరిలో ఉంది. ఇక నవంబర్ 1న విడుదల అవుతున్న మాస్ మహారాజా రవితేజ(రవితేజ)వన్ మాన్ షో మాస్ జాతర(Mass Jathara)కోసం కూడా అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. పక్కా మాస్ అంశాలతో మాస్ జాతర ముస్తాబవడం, భీమ్స్ అందించిన సాంగ్స్ ప్రేక్షకుల్లోకి రావడం, థమాక తో మెప్పించిన రవితేజ శ్రీలీల కాంబో మరోసారి సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేయబోతోందని ట్రైలర్ తో అర్ధం కావడంతో మాస్ జాతర కోసం కూడా అందరు ఆసక్తిగా ఉన్నారు.

ఇది కూడా చదవండి: చిరంజీవి పై మాళవిక మోహనన్ కీలక వ్యాఖ్యలు.. రూమర్స్ కి చెక్

ఈ రెండు చిత్రాలు ఒక్క రోజు తేడాతోనే వస్తున్నా, తొలి రోజు హయ్యస్ట్ కలెక్షన్స్ లో ఎవరు గెలుస్తారనే చర్చ సోషల్ మీడియా వేదికగా అభిమానుల్లో జరుగుతుంది. ప్రస్తుతం రెండు చిత్రాలకి బుక్ మై షో యాప్ లాంటి బుకింగ్స్ ఫాస్ట్ గానే ఉన్నాయి. రెండు చిత్రాలు ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి, ఓవర్ సీస్ లో కూడా రెండు చిత్రాలు మియర్స్ దగ్గర నుంచే సందడి చేస్తున్నాయి.

You may also like

Leave a Comment

MS Live 99 News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana,  is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird