





ఖమ్మం ,ఖానాపురం సెప్టెంబర్ 6 : స్ధానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లునను అడ్డుకుంటే రాష్ట్రంలో ప్రళయం స్రృష్టిస్తామని బీసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ వరపు శ్రీనివాస్ హెచ్చరించారు.ఖమ్మం ఖానాపురం లో శుక్రవారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.జనాబాలో 56శాతం ఉన్న బీసీ లకు న్యాయం చేసేందుకు సహాకరించాలని లేకుంటే ఏం రాజకీయ పార్టీ ని వదిలేది లేదని ఇకపై బీసీ ల సత్తా చూపిస్తామన్నారు.స్కాలర్షిప్ లు పూర్తి స్థాయిలో విడుదల చేయాలని అన్నారు.లేకుంటే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణమాచారి అన్నారు.జిల్లా కార్యదర్శి గా శివరామకృష్ణ ను నియమిస్తూ నియామాకపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో లింగబోయిన పుల్లారావు, బొడ్డు కృష్ణ,మోడేపల్లి వెంకటా చారి, ఇనుముల రాము యాధవ్,రచ్చ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

CEO
Mslive 99news
Cell : 9963185599