ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయం లో ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులకు సంబంధించి ముఖ్య నాయకుల సమావేశం లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్,క్యాంప్ కార్యాలయ ఇంచార్జ్ తుంబురు దయాకర్ రెడ్డి,నియోజక ఇంచార్జి శ్రీనివాస్ పాల్గొన్నారు .ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఎదులాపురం మున్సిపాలిటీ లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా ఎలా ముందుకు వెళ్ళాలి అలాగే స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి అని వారు ముఖ్య నాయకులకు సలహాలు మరియు సూచనలు తెలిపారు .ఈకార్యక్రమంలో మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాథ్ బాబు,ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్,రషీద్,తమ్మినేని.నవీన్, గోనె భుజంగ రెడ్డి, ఎదులాపురం మున్సిపల్ కాంగ్రెస్ ముఖ్యనాయకులు పాల్గొన్నారు.



CEO
Mslive 99news
Cell : 9963185599
